UN Security Council: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్‌కు భారత్ మరోసారి ఘాటుగా బదులిచ్చింది. అసంబద్ధ ఆరోపణలతో అంతర్జాతీయ వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం తగదని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంలో భాగంగా కొనసాగిస్తున్న దేశానికి ప్రపంచానికి నీతులు చెప్పే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశం వేరే అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసినప్పటికీ, పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి ఐరాస వేదికను దుర్వినియోగం చేసిందని విమర్శించారు.
జమ్మూకశ్మీర్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, దీనిపై ఎలాంటి సందేహానికీ తావు లేదని హరీశ్ మరోసారి స్పష్టం చేశారు. కశ్మీర్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఏకైక అంశం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మాత్రమేనని పేర్కొన్నారు. అలాగే సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, నిజాయితీ ఉన్నప్పుడే ఒప్పందాలు సజావుగా కొనసాగుతాయని, ఒకవైపు సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మరోవైపు సహకారం కోరడం సరికాదని అన్నారు. భారత్‌పై ఆరోపణలు చేయడం కంటే, తమ దేశంలోని ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత, అంతర్గత సమస్యల పరిష్కారంపై పాకిస్థాన్ దృష్టి పెట్టాలని హరీశ్ సూచించారు.
ALSO READ: Anupam Kher | ఉద్యమం మీదే.. రాజకీయాలది కాదు: అనుపమ్ ఖేర్ కీలక వ్యాఖ్యలు








