Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeTelanganaSIR Process | తెలంగాణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కీలక అప్డేట్.. జూన్ 25 నుంచి వెరిఫికేషన్

SIR Process | తెలంగాణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కీలక అప్డేట్.. జూన్ 25 నుంచి వెరిఫికేషన్

-

Chat on WhatsApp

SIR Process: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి కీలక కీలక అంశాలను వెల్లడించారు. వచ్చే నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బూత్ లెవెల్ అధికారులు (BLOs) ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని చెప్పారు. ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తారని, వాటిలో ఒకటి పూర్తిచేసి తిరిగి సమర్పించాల్సి ఉంటుందని, మరో ఫారం ఓటర్ వద్దే ఉండే అన్‌నోటిఫైడ్ రికార్డుగా ఉంటుందని వివరించారు.

అదే విధంగా ఆన్‌లైన్ ద్వారా కూడా ఎన్యుమరేషన్ పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. పూర్తి చేసిన ఫారాలను సేకరించిన తర్వాత జులై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేస్తామని చెప్పారు.

ఈ డ్రాఫ్ట్ జాబితాపై జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో చివరిసారిగా 2002లో ఇలాంటి సమగ్ర సవరణ ప్రక్రియ జరిగిందని, దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ SIR ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో అర్హులు మాత్రమే ఉండేలా చూడటమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని సీఈవో స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp