Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsVivo Smartphone | Vivo ఫోన్లు కొనాలనుకునేవారికి షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు

Vivo Smartphone | Vivo ఫోన్లు కొనాలనుకునేవారికి షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు

-

Chat on WhatsApp

Vivo Smartphone: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు వివో ఊహించని షాక్ ఇచ్చింది. కంపెనీ తన పలు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను సవరించింది. తాజా నిర్ణయంతో X, V, T, Y సిరీస్‌లకు చెందిన మొత్తం తొమ్మిది మోడళ్ల ధరలు పెరిగాయి. మోడల్‌ను బట్టి రూ.2,000 నుంచి రూ.7,000 వరకు అదనపు భారం వినియోగదారులపై పడనుంది.

ధరల సవరణలో అత్యధిక పెరుగుదల Vivo X300 FEకు నమోదైంది. ఈ మోడల్‌పై రూ.7,000 వరకు ధర పెరగడంతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో దీని ధర మరింత పెరిగింది. తాజా ధరల ప్రకారం 12GB + 256GB వేరియంట్ రూ.86,999కు, 12GB + 512GB వేరియంట్ రూ.96,999కు చేరుకుంది. ధరలు పెరిగిన జాబితాలో Vivo V70 FE, T4 Lite 5G, Y51 Pro, Y31 5G, T5x, Y21, Y11, Y05 వంటి మోడళ్లు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ఫోన్లకు గతంలోనే ధరలు పెరగగా, ఇప్పుడు మరోసారి సవరణ చేయడంతో ప్రారంభ ధరలతో పోలిస్తే గణనీయమైన మార్పు కనిపిస్తోంది.

పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం మెమరీ చిప్‌ల ధరల పెరుగుదల, గ్లోబల్ సరఫరా వ్యవస్థలో ఏర్పడిన ఒత్తిడి, ఉత్పత్తి వ్యయాలు అధికమవడం వంటి కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ధరల పెంపుపై వివో సంస్థ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు తాజా ధరలను ఒకసారి పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp