Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeTelanganaKTR | ‘అండర్ 18 వరల్డ్’ షోలో కేటీఆర్ ఫన్ మోడ్.. ప్రభాస్‌కు లైవ్ కాల్‌

KTR | ‘అండర్ 18 వరల్డ్’ షోలో కేటీఆర్ ఫన్ మోడ్.. ప్రభాస్‌కు లైవ్ కాల్‌

-

Chat on WhatsApp

KTR: తెలంగాణ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన విభిన్న కోణంతో అందరిని ఆకట్టుకున్నారు. సాధారణంగా రాజకీయ చర్చలు, అధికారిక సమావేశాల్లో కనిపించే ఆయన ఈసారి మాత్రం పూర్తిగా సరదా మూడ్‌లో కనిపించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ‘ది అండర్ 18 వరల్డ్’(Under 18 World) అనే పిల్లల టాక్ షోకు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల కాగా, అందులో కేటీఆర్ పాల్గొన్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది.

చిన్నారులు అడిగిన సరదా ప్రశ్నలకు ఆయన ఇచ్చిన స్పందనలు నవ్వులు పూయించాయి. కొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పలేక కేటీఆర్ తల పట్టుకోవడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. షోలో మరింత ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. కేటీఆర్ లైవ్‌లో ఉండగానే టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు వీడియో కాల్ చేయడం అక్కడ ఉన్న పిల్లలను మాత్రమే కాకుండా ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ సడెన్ కాల్ షోకు పెద్ద సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా మారింది. ఇంకో సందర్భంలో ఓ చిన్నారి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి కేటీఆర్ స్టేజ్‌పైనే పుష్-అప్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయ నాయకుడిగా ఉన్న గంభీరతకు భిన్నంగా ఆయనలోని స్పోర్టివ్ మరియు ఎంటర్‌టైనింగ్ వైపు ఈ షోలో స్పష్టంగా కనిపించింది. షో మధ్యలో ఆయనకు తన సతీమణి కల్వకుంట్ల శైలిమ నుంచి ఫోన్ రావడం కూడా మరో ఫన్నీ హైలైట్‌గా మారింది. తాను షూట్‌లో ఉన్నానని చెప్పి త్వరగా కాల్ కట్ చేయడం నెటిజన్లలో నవ్వులు తెప్పించింది.

ఈ ప్రోమో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. కేటీఆర్‌లోని ఈ కొత్త, సరదా అవతార్‌పై రాజకీయ వర్గాలు మరియు నెటిజన్లు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. పూర్తి ఎపిసోడ్ త్వరలో విడుదల కానుండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp