Thursday, August 6, 2026
Chat on WhatsApp
HomeNationalఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఫోన్ కావాలా? రియల్‌మీ పీ4 పవర్ ఇదే సమాధానం

ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఫోన్ కావాలా? రియల్‌మీ పీ4 పవర్ ఇదే సమాధానం

-

Chat on WhatsApp

Realme P4 Power 5G: స్మార్ట్‌ఫోన్ వాడకంలో బ్యాటరీ లైఫ్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఫోన్ వాడాలనుకునే వారికి రియల్‌మీ తీసుకొచ్చిన తాజా ఆఫర్ ‘రియల్‌మీ పీ4 పవర్ 5జీ'(Realme P4 Power 5G). ఏకంగా “10,001mAh భారీ బ్యాటరీ”తో మార్కెట్‌లోకి వచ్చిన ఈ ఫోన్, నిజంగానే ‘డెడ్ లెస్ స్మార్ట్‌ఫోన్’ అన్న ట్యాగ్‌కు పూర్తి న్యాయం చేస్తోంది.

సాధారణ వినియోగంలో ఈ ఫోన్ రోజులు పాటు ఛార్జ్ అవసరం లేకుండా పనిచేస్తుంది. వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా, కాల్స్, గేమింగ్ వంటి హెవీ యూజ్‌లోనూ బ్యాటరీ పనితీరు అద్భుతంగా ఉంది.

బ్యాటరీ పరంగా ఇది ఈ సెగ్మెంట్‌లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. డిస్‌ప్లే క్వాలిటీ ఆకట్టుకునేలా ఉండటంతో పాటు, రోజువారీ మల్టీటాస్కింగ్‌కు పనితీరు సరిపోతుంది. హైఎండ్ గేమింగ్ కోసం కాకపోయినా, సాధారణ యూజర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

కెమెరా విషయంలో మాత్రం ఈ ఫోన్ సగటు స్థాయిలోనే ఉంది. ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది టాప్ ఛాయిస్ కాకపోవచ్చు. అయితే రోజువారీ అవసరాలు, సోషల్ మీడియా పోస్టులకు మాత్రం సరిపోతుంది. రూ.27,999 ప్రారంభ ధరలో భారీ బ్యాటరీ, మంచి డిస్‌ప్లే, స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌తో ఈ ఫోన్ విలువైన ప్యాకేజీగా నిలుస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి రియల్‌మీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

also read:Prabhas Spirit | ప్రభాస్ లుక్ కోసం బ్రేక్.. స్పిరిట్ మూవీపై లేటెస్ట్ అప్‌డేట్

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp