Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeNational24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

-

Chat on WhatsApp

Rajya Sabha election schedule: దేశవ్యాప్తంగా ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లో జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, గుజరాత్‌లో నాలుగు, కర్ణాటకలో నాలుగు, మధ్యప్రదేశ్‌లో మూడు, జార్ఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మిగతా రాష్ట్రాల్లో కూడా ఖాళీల ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల కోసం జూన్ 1న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 8 వరకు నామినేషన్ల దాఖలు గడువు ఉండగా, జూన్ 9న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. అభ్యర్థులు జూన్ 11 వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.

జూన్ 18న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ చర్చలు వేడెక్కే అవకాశముంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp