Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeInterNationalసింగపూర్‌లో కరోనా టెన్షన్... వారంలోనే 12000 పైగా కేసులు ...!

సింగపూర్‌లో కరోనా టెన్షన్… వారంలోనే 12000 పైగా కేసులు …!

-

Chat on WhatsApp

Singapore COVID-19: ప్రపంచనే వణికించిన కరోనా మహమ్మారి మళ్ళీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గినప్పటికీ, సింగపూర్‌లో మాత్రం కేసులు మరోసారి వేగంగా పెరుగుతున్నాయి. సింగపూర్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ నెల 10 నుంచి 16 తేదీల మధ్య ఒక్క వారం వ్యవధిలోనే 12,700 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇది అంతకుముందు వారంతో పోలిస్తే దాదాపు 58.8 శాతం అధికం కావడం గమనార్హం. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు అధికమవుతోంది. గతంలో రోజుకు సగటున 56 మంది ఆసుపత్రిపాలు కాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 73కు చేరింది. అయితే ప్రస్తుతానికి ఎలాంటి మరణాలు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ‘NB.1.8.1’ కరోనా వేరియంట్‌పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సింగపూర్ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.

ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించడం, గుంపుల ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp