ChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ఓపెన్ఏఐ(OpenAI) CHAT GPT జెమినీ AI కి షాక్ ఇచ్చింది. చాట్‌జీపీటీ సేవలను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్‌పాయింట్‌తో అనుసంధానం చేసింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు AI సహాయంతో కొత్త ప్రెజెంటేషన్ స్లైడ్లను సులభంగా రూపొందించుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న స్లైడ్లను కూడా ఎడిట్ చేసుకునే అవకాశం పొందనున్నారు.
ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. యూజర్లు సాధారణ టెక్స్ట్ కమాండ్ ఇచ్చిన వెంటనే చాట్‌జీపీటీ దాన్ని అర్థం చేసుకుని ఆటోమేటిక్‌గా ప్రెజెంటేషన్ సిద్ధం చేస్తుంది. అలాగే పాత స్లైడ్లలో టెక్స్ట్ మార్పులు చేయడం, కొత్త సమాచారం జోడించడం వంటి పనులను కూడా AI సులభంగా నిర్వహించగలదు.
కంపెనీ ప్రకారం Gmail, Microsoft Outlook, SharePoint వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుంచి అవసరమైన సమాచారాన్ని తీసుకుని కూడా ప్రెజెంటేషన్ తయారీలో ChatGPT సహాయపడుతుంది. దీంతో వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌ల నుంచి డేటాను మాన్యువల్‌గా కాపీ చేయాల్సిన అవసరం తగ్గి సమయం ఆదా అవుతుందని పేర్కొంది.
ఈ ఫీచర్‌ను ఫ్రీ ప్లాన్ యూజర్లు, అలాగే ChatGPT బిజినెస్ యూజర్లు కూడా ఉపయోగించవచ్చని ఓపెన్‌ఏఐ వెల్లడించింది. రాబోయే రోజుల్లో దీనిని మరింత మెరుగుపరచనున్నట్లు తెలిపింది. AI ఆధారిత స్లైడ్ డిజైన్, కంటెంట్ క్రియేషన్ వల్ల విద్య, కార్యాలయ పనులు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక AI రంగంలో పోటీ కూడా వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే Anthropic సంస్థ తన Claude చాట్‌బాట్‌లో ఇలాంటి ఫీచర్‌ను అందిస్తోంది. Google Gemini కూడా Google Slidesతో అనుసంధానమై పనిచేస్తోంది. ఇప్పుడు OpenAI పవర్‌పాయింట్ సపోర్ట్ తీసుకురావడంతో AI టూల్స్ మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.








