Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTPeddi Movie Collections | బాక్సాఫీస్ ఛాంపియన్‌గా ‘పెద్ది’.. 5 రోజుల్లో రూ.315 కోట్ల గ్రాస్

Peddi Movie Collections | బాక్సాఫీస్ ఛాంపియన్‌గా ‘పెద్ది’.. 5 రోజుల్లో రూ.315 కోట్ల గ్రాస్

-

Chat on WhatsApp

Peddi Movie Collections: రామ్ చరణ్ హీరోగా రూపొందినపెద్ది’ చిత్రం విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణను సొంతం చేసుకుంటూ వసూళ్ల పరంగా సత్తా చాటుతోంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం, వసూళ్ల పరంగా కూడా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి సుకుమార్ రైటింగ్స్, జియో స్టూడియోస్ మద్దతు అందించాయి. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్ది’కు అన్ని ప్రాంతాల నుంచి సానుకూల స్పందన లభించింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత వేగంగా రూ.300 కోట్ల మార్కును అందుకున్న సోలో సినిమాగా ‘పెద్ది’ ప్రత్యేక గుర్తింపు పొందింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp