LIVE
Wednesday, November 18, 2026
LIVE
LIVE

Akvan Cyclone | ఆంధ్రప్రదేశ్‌కు తప్పిన పెను తుఫాన్ ముప్పు

by Bajaswamy
2 views

Akvan Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ భయాలు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న వేళ.. వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకుంటున్న మార్పులు రాష్ట్రానికి కొంత ఊరటనిస్తున్నాయి. అతి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని భావించిన ‘అక్వాన్’ క్రమంగా బలహీనపడే అవకాశాలు ఉన్నట్లు తాజా వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా తుఫాన్ దిశ, తీవ్రతలో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం మరో రెండు రోజుల పాటు తుఫాన్ సముద్రంలోనే కొనసాగే అవకాశం ఉంది. అనంతరం తీరానికి చేరువయ్యే కొద్దీ దాని తీవ్రత తగ్గి బలహీనపడవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

తాజా అంచనాల ప్రకారం పూరీ నుంచి నర్సాపూర్ మధ్య, శ్రీకాకుళం తీరానికి సమీపంలో తుఫాన్ ప్రభావం కనిపించే సూచనలు ఉన్నాయి. అయితే తుఫాన్ తీవ్రత తగ్గినా వర్షాల ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లోని ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటించాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి అక్వాన్ తుఫాన్ తీవ్రత తగ్గే సూచనలు ఏపీకి ఊరటనిస్తున్నప్పటికీ, వర్షాల నేపథ్యంలో అప్రమత్తతే అత్యంత అవసరం.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More