LIVE
Sunday, November 22, 2026
LIVE
LIVE

Beggar Donates Lakhs | భిక్షాటన చేస్తూ లక్షల విరాళాలు.. నర్సియమ్మ గొప్ప మనసుకు జేజేలు

by Bajaswamy
6 views
Narsiyamma, a beggar from Tuni, donates her savings from alms to temples as a noble act of service.

Beggar Donates Lakhs: మన దగ్గర ఎంత సంపద ఉందన్నది కాదు.. మనసులో ఎంత దాతృత్వం ఉందన్నదే గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది. కొందరు కోట్ల రూపాయలు సంపాదించినా సాయం చేయడానికి ముందుకు రారు. మరికొందరు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తమకు చేతనైనంత సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తారు. ఈ కోవలోకే వస్తారు కాకినాడ జిల్లా తునికి చెందిన నర్సియమ్మ. రోజూ భిక్షాటన చేస్తూ జీవనం సాగించే నర్సియమ్మ.. తనకు వచ్చిన కొద్దిపాటి ఆదాయంలోనే కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేస్తున్నారు. అలా కూడబెట్టిన డబ్బును తన అవసరాలకే కాకుండా ఆలయాల అభివృద్ధి, దైవ సేవ కోసం విరాళంగా అందిస్తున్నారు. సొంత ఇల్లు లేదు.. స్థిరమైన ఆదాయం లేదు.. విలువైన ఆస్తులు కూడా లేవు. అయినప్పటికీ దేవుడి పట్ల ఉన్న భక్తి, సేవ చేయాలనే సంకల్పం ఆమెను ఈ దిశగా నడిపిస్తున్నాయి.

సాధారణంగా భిక్షాటన చేసే వారి గురించి సమాజంలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. కానీ నర్సియమ్మ చేస్తున్న సేవ మాత్రం అందరి ఆలోచనలను మార్చేలా ఉంది. తాను కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత భాగాన్ని ఆలయాలకు అందిస్తూ లక్షల రూపాయల విరాళాలు సమర్పించడం విశేషంగా నిలుస్తోంది. ఆమె చూపిస్తున్న ఈ ఔదార్యం పలువురిని ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా ప్రశంసలు అందుకునేలా చేస్తోంది. మొత్తానికి, సంపద ఉన్నవారే దాతలు కావాల్సిన అవసరం లేదని నర్సియమ్మ తన చేతలతో చాటిచెబుతున్నారు. ఇతరులకు సాయం చేయాలనే మంచి మనసుంటే చిన్న మొత్తంతోనూ గొప్ప సేవ చేయవచ్చని నిరూపిస్తున్నారు. ఆమె దాతృత్వం సమాజానికి ఒక మంచి సందేశంగా నిలుస్తోంది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More