LIVE
Sunday, November 22, 2026
LIVE
LIVE

Pakistan suicide attack | పాకిస్థాన్‌లో  మరోసారి బాంబు బీభత్సం.. పోలీసులతో సహా 30 మందికి గాయాలు

by Bajaswamy
8 views

Pakistan suicide attack: పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల దాడులు మరోసారి కలకలం రేపాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో పోలీస్ చెక్‌పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శనివారం చోటుచేసుకున్న ఈ పేలుడులో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోగా.. పోలీసులతో సహా మరో 30 మంది గాయపడ్డారు. పేలుడు సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆరు అంబులెన్సులతో ఘటనా స్థలానికి చేరుకున్న బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు కరక్‌, హంగు జిల్లాల నుంచి అదనపు సిబ్బందిని కూడా రప్పించినట్లు రెస్క్యూ విభాగం ప్రతినిధి బిలాల్ అహ్మద్ ఫైజీ తెలిపారు.

ఈ దాడికి తామే బాధ్యులమంటూ నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ప్రకటించినట్లు సమాచారం. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న హఫీజ్ గుల్ బహదూర్ నేతృత్వంలోని ఇత్తిహాదుల్ ముజాహిదీన్ పాకిస్థాన్ ముఠా కూడా దాడిలో తమ ప్రమేయం ఉన్నట్లు ప్రకటించినట్లు సమాచారం. పేలుడు ఘటనపై ఖైబర్ పఖ్తుంఖ్వా గవర్నర్ ఫైసల్ కరీం కుందీ తీవ్రంగా స్పందించారు. ఘటనను ఖండిస్తూ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు భద్రతా బలగాలు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. డేరా ఇస్మాయిల్‌ ఖాన్‌లో జరిగిన ఈ దాడితో ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో భద్రతా పరిస్థితిపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరుస ఉగ్ర ఘటనల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమై, దాడికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More