Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTNaga Chaitanya | సోషల్ మీడియా ట్రోలింగ్‌పై నాగచైతన్య ఆవేదన..ఆమెది తప్పులేదు

Naga Chaitanya | సోషల్ మీడియా ట్రోలింగ్‌పై నాగచైతన్య ఆవేదన..ఆమెది తప్పులేదు

-

Chat on WhatsApp

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య తన వ్యక్తిగత జీవితంపై మరోసారి స్పందిస్తూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. సమంతతో విడాకుల అనంతరం, ఆయన నటి శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శోభితపై సోషల్ మీడియాలో వచ్చిన నెగెటివిటీపై నాగచైతన్య ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా చేసిన వ్యాఖ్యల్లో ఆయన మాట్లాడుతూ, తన రెండో పెళ్లి విషయంలో శోభితను అనవసరంగా నిందించడం సరైంది కాదని స్పష్టం చేశారు. “శోభిత పట్ల నాకు చాలా బాధగా ఉంది. ఆమె ఎటువంటి తప్పు చేయకపోయినా, నెటిజన్లు అన్యాయంగా ఆమెపై నెగెటివిటీ పెంచారు. ఆ సమయంలో ఆమె పడిన బాధను చూసి నేను కూడా ఎంతో వేదనకు గురయ్యాను” అని చైతన్య అన్నారు.

తమ బంధం ఎలా ప్రారంభమైందో కూడా ఆయన వివరించారు. తాము మొదట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కలుసుకున్నామని, తరువాత ఒకరినొకరు అర్థం చేసుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నామని తెలిపారు. తమ వ్యక్తిగత జీవితం ఎంతో పారదర్శకంగా సాగుతున్నప్పటికీ, బయట జరుగుతున్న విమర్శలు తనను బాధించాయని ఆయన పేర్కొన్నారు.

అటు సమంత, ఇటు నాగచైతన్య ఇద్దరూ తమ గత జీవితాన్ని విడిచి కొత్త భాగస్వాములతో ముందుకు సాగుతున్నప్పటికీ, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు, ట్రోల్స్ మాత్రం కొనసాగుతున్నాయి. అయితే వీరిద్దరూ ప్రస్తుతం తమ జీవితాల్లో సంతోషంగా ఉన్నారని సమాచారం.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indian chess Grandmaster Praggnanandhaa

Praggnanandhaa | 20 ఏళ్ల వయసులో అరుదైన ఘనత..  ప్రజ్ఞానంద ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్!

Praggnanandhaa: చదరంగ ప్రపంచంలో మరోసారి భారత జెండాను రెపరెపలాడించాడు యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద. కేవలం 20 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటుతూ మరో ప్రతిష్టాత్మక విజయాన్ని అందుకున్నాడు. అమెరికాలో...
- Advertisement -
Chat on WhatsApp