Exit poll Results: దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ నెలకొన్న వేళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలపై ఆపరేషన్ చాణక్య సర్వే సంస్థ అంచనాలు విడుదల చేసింది. ఈ ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పశ్చిమ బెంగాల్‌లో ఈసారి బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తాయని సర్వే పేర్కొంది. కమలం పార్టీ 147 నుంచి 153 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, టీఎంసీ 119 నుంచి 130 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇతరులు సుమారు 11 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది.
కేరళలో UDF కూటమి 72 నుంచి 75 స్థానాలతో ముందంజలో ఉండగా, LDF 55 నుంచి 61 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.
అస్సాంలో NDA కూటమి 74 నుంచి 78 స్థానాలతో ఆధిక్యంలో ఉండగా, ఇండియా అలయన్స్ 45 నుంచి 48 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేసింది.
తమిళనాడులో DMK 125 నుంచి 130 స్థానాలతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది. AIADMK 80 నుంచి 85 స్థానాలు, TVK 15 నుంచి 18 స్థానాలు సాధించవచ్చని పేర్కొంది.
పుదుచ్చేరిలో NDA కూటమి 15 నుంచి 17 స్థానాలతో ముందంజలో ఉండగా, DMK-INDIA కూటమి 11 నుంచి 13 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.








