Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeSportsPraggnanandhaa | 20 ఏళ్ల వయసులో అరుదైన ఘనత..  ప్రజ్ఞానంద ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్!

Praggnanandhaa | 20 ఏళ్ల వయసులో అరుదైన ఘనత..  ప్రజ్ఞానంద ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్!

-

Chat on WhatsApp

Praggnanandhaa: చదరంగ ప్రపంచంలో మరోసారి భారత జెండాను రెపరెపలాడించాడు యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద. కేవలం 20 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటుతూ మరో ప్రతిష్టాత్మక విజయాన్ని అందుకున్నాడు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ “సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ 2026(Saint Louis GCT Rapid and Blitz 2026)” టోర్నీలో ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. ఐదు రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ జవోఖిర్ సిందరోవ్ నుంచి గట్టి పోటీ ఎదురైనా, చివరికి 1.5 పాయింట్ల ఆధిక్యంతో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్ రౌండ్ పూర్తికాకముందే ప్రజ్ఞానంద విజయం ఖరారైంది. ఈ గెలుపుతో అతడికి 50 వేల డాలర్ల నగదు బహుమతి, 13 GCT పాయింట్లు లభించాయి.

2026 సీజన్ స్టాండింగ్స్‌లో అమెరికా ఆటగాడు ఫాబియానో కరువానా తర్వాత ప్రజ్ఞానంద రెండో స్థానంలో నిలిచాడు. ఇక జీసీటీ సీజన్ ఆగస్టు 10న జరిగే సింక్విఫీల్డ్ కప్తో ముగియనుంది. ఈ టోర్నీలో ప్రజ్ఞానందతో పాటు సెయింట్ లూయిస్ పోటీల్లో పాల్గొన్న అగ్రశ్రేణి ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. ఇటీవలే ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. అక్కడ ప్రపంచ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌పై రెండుసార్లు విజయం సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ప్రజ్ఞానందకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Shubman Gill injured during practice session before India's Sri Lanka Test series.

Sri Lanka Test 2026 | శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.....

Sri Lanka Test 2026: శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతున్న టీమిండియాకు అనుకోని షాక్ తగిలింది. టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటంతో, శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల...
- Advertisement -
Chat on WhatsApp