Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeInterNationalBatik Air Flight | విమానం ఎగురుతుండగానే డోర్ తెరవాలనుకున్నాడు.. తర్వాత ఏం జరిగిందంటే?

Batik Air Flight | విమానం ఎగురుతుండగానే డోర్ తెరవాలనుకున్నాడు.. తర్వాత ఏం జరిగిందంటే?

-

Chat on WhatsApp

Batik Air Flight: ప్రయాణికుల అప్రమత్తతతో ఓ భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. మలేషియాలోని కౌలాలంపూర్(Kuala Lumpur) నుంచి కేరళలోని కొచ్చికి వస్తున్న బాటిక్ ఎయిర్ విమానంలో ఓ ప్రయాణికుడు గాల్లోనే ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. సమాచారం ప్రకారం, OD231 విమానంలో ప్రయాణిస్తున్న జంషీర్ అతానిక్కల్ (36) అనే వ్యక్తి విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరవడానికి యత్నించాడు. ఈ క్రమంలో ఎగ్జిట్ విండో ప్యానెల్‌ను కూడా ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు.

అతడి అనుమానాస్పద ప్రవర్తనను గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అడ్డుకుని సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం సురక్షితంగా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారులు జంషీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఈ సంఘటన విమాన భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indian chess Grandmaster Praggnanandhaa

Praggnanandhaa | 20 ఏళ్ల వయసులో అరుదైన ఘనత..  ప్రజ్ఞానంద ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్!

Praggnanandhaa: చదరంగ ప్రపంచంలో మరోసారి భారత జెండాను రెపరెపలాడించాడు యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద. కేవలం 20 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటుతూ మరో ప్రతిష్టాత్మక విజయాన్ని అందుకున్నాడు. అమెరికాలో...
- Advertisement -
Chat on WhatsApp