మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రస్తుతం జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర కోసం జపాన్ వెళ్లిన ఆయన, అక్కడి అందాలను ఆస్వాదిస్తూ విశ్రాంతిగా గడుపుతున్నారు. టోక్యో సహా పలు ప్రధాన నగరాలను సందర్శిస్తున్నారు.
తాజాగా మల్లారెడ్డి జపాన్‌లో ప్రసిద్ధమైన బుల్లెట్ ట్రెయిన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కే ముందు బుల్లెట్ రైలుకు ఎదురుగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ లుక్‌లో కనిపించిన ఆయనతో అభిమానులు, పర్యాటకులు ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపారు.
జపాన్ ప్రజలతో కలసి ముచ్చట్లు మాట్లాడుతూ, వారితో సెల్ఫీలు దిగుతూ మల్లారెడ్డి సూపర్ స్టార్ లా ఫీల్ అవుతున్నట్లు కనిపించారు. విదేశాల్లో కూడా స్థానికుల ప్రేమతో మల్లారెడ్డికి ప్రత్యేక ఆదరణ లభిస్తోంది. ప్రతి నగరంలో ఆయన పర్యటన హైలైట్‌గా మారుతోంది.
ఈ ఫ్యామిలీ ట్రిప్‌లో మల్లారెడ్డి పూర్తి ఉత్సాహంగా గడుపుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సందర్శిస్తున్న ప్రతి ప్రదేశాన్ని కెమెరాలో బంధిస్తూ అందమైన జ్ఞాపకాలను ఏర్పరుచుకుంటున్నారు. తన యాత్రను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు.