Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeNationalVande Mataram Law | వందేమాతరానికి మరింత గౌరవం.. కొత్త చట్టానికి రాష్ట్రపతి ఆమోదం!

Vande Mataram Law | వందేమాతరానికి మరింత గౌరవం.. కొత్త చట్టానికి రాష్ట్రపతి ఆమోదం!

-

Chat on WhatsApp

Vande Mataram Law: స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి కోట్లాది భారతీయుల హృదయాల్లో దేశభక్తి భావాన్ని నింపిన వందేమాతరం గీతంపై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. వందేమాతరం గీతానికి ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో రూపొందించిన చట్టానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) ఆమోదముద్ర వేశారు. ఈ చట్టం ప్రకారం వందేమాతరం గీతాన్ని అవమానించడం, ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా హేళన చేయడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణించనున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యక్రమాలు, బహిరంగ సభల్లో గీతాలాపన జరుగుతున్న సమయంలో క్రమశిక్షణ, గౌరవాన్ని పాటించేలా నిబంధనలు అమలు చేయనున్నట్లు పేర్కొంది.

జాతీయ గీతం జన గణ మనకు ఉన్న గౌరవ ప్రమాణాల మాదిరిగానే వందేమాతరం విషయంలోనూ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం. దేశ చరిత్ర, జాతీయ భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ గీతానికి మరింత ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో కేంద్రం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ నిర్ణయానికి చట్టబద్ధత వచ్చింది. వందేమాతరం గీతం భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిందని, కొత్త నిర్ణయం జాతీయ ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Shubman Gill injured during practice session before India's Sri Lanka Test series.

Sri Lanka Test 2026 | శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.....

Sri Lanka Test 2026: శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతున్న టీమిండియాకు అనుకోని షాక్ తగిలింది. టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటంతో, శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల...
- Advertisement -
Chat on WhatsApp