Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeInterNationalJeff Bezos | AI ఉద్యోగాలను తినేయదు.. జెఫ్ బెజోస్ సంచలన వ్యాఖ్యలు

Jeff Bezos | AI ఉద్యోగాలను తినేయదు.. జెఫ్ బెజోస్ సంచలన వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

కృత్రిమ మేధస్సు (AI) విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అనేక కంపెనీలు ఆటోమేషన్, AI ఆధారిత టెక్నాలజీలను స్వీకరిస్తుండటంతో ఉద్యోగాల కోతలు పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంచనాలను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(Jeff Bezos) పూర్తిగా ఖండించారు. AI కారణంగా భారీ స్థాయిలో ఉద్యోగాలు కనుమరుగవుతాయని భావించడం సరైన దృక్పథం కాదని ఆయన స్పష్టం చేశారు.

సాంకేతిక విప్లవాలు గతంలో కూడా ఎన్నో మార్పులకు దారి తీసినప్పటికీ, అవి కొత్త రంగాల ఆవిర్భావానికి కారణమయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుతం AI కూడా అదే దిశగా ప్రయాణిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జెఫ్ బెజోస్, AI ఉత్పాదకతను పెంచడంతో పాటు కొత్త పరిశ్రమల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తోందని చెప్పారు.

దీని ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. AIను కేవలం ఉద్యోగాలకు ముప్పుగా కాకుండా, ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలను తీసుకొచ్చే సాధనంగా చూడాలని సూచించారు. ఇదిలా ఉండగా, జెఫ్ బెజోస్ ఇటీవల వ్యాపారవేత్త విక్ బజాజ్‌తో కలిసి “ప్రోమోథియస్” పేరుతో ఒక కొత్త AI వెంచర్‌ను ప్రారంభించారు.

భవిష్యత్ టెక్నాలజీల అభివృద్ధి, AI ఆధారిత పరిష్కారాలపై ఈ సంస్థ దృష్టి సారించనున్నట్లు సమాచారం. జెఫ్ బెజోస్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

BMW Offers Voluntary Retirement to 40,000 Employees Amid Global Cost-Cutting

BMW | లాభాలు తగ్గడంతో BMW కఠిన నిర్ణయం.. వేల ఉద్యోగాలకు గుడ్‌బై

ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజం BMW కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న వ్యయాలు, చైనా మార్కెట్‌లో అమ్మకాలు పడిపోవడం, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో లాభాలు తగ్గడంతో జర్మనీలో వేలాది మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ...
- Advertisement -
Chat on WhatsApp