Friday, July 3, 2026
Chat on WhatsApp
HomeSportsIPL 2026 | నేడే అసలైన పోరు...డూ ఆర్ డై మ్యాచ్‌లో గెలిచేదెవరు...?

IPL 2026 | నేడే అసలైన పోరు…డూ ఆర్ డై మ్యాచ్‌లో గెలిచేదెవరు…?

-

Chat on WhatsApp

IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఒక జట్టు ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేసుకోగా, మిగిలిన మూడు స్థానాల కోసం ఐదు జట్లు తీవ్ర పోటీ పడుతున్నాయి. పాయింట్ల పట్టికలో మార్పులు మ్యాచ్‌ల ఫలితాలతో మరింత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య పోరు ప్లేఆఫ్స్ సమీకరణాలను ప్రభావితం చేయనుంది.

ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని నిలుపుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 12 పాయింట్లతో పోటీ కొనసాగిస్తున్నాయి.

చెపాక్‌లో జరిగే కీలక మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధిస్తే టాప్-4లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అదే సమయంలో హైదరాబాద్‌కు టాప్-2లోకి చేరే అవకాశాలు కూడా మెరుగవుతాయి. మరోవైపు ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్నప్పటికీ మిగతా జట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

తుది లీగ్ మ్యాచ్‌లలో ఫలితాలు, నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ప్రతి మ్యాచ్ ఇప్పుడు “చావో రేవో ”గా మారింది.

ALSO READ: Telangana government | లబ్ధిదారులకు శుభవార్త…జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు ప్రారంభం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indian Government | చిన్నారుల భద్రతపై కేంద్రం సీరియస్.. ఇన్‌స్టాగ్రామ్‌కు నోటీసులు జారీ

Indian Government: సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక నోటీసులు జారీ చేసింది. చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ...
- Advertisement -
Chat on WhatsApp