Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeSportsIndia vs Afghanistan | 152 పరుగులకే కుప్పకూలిన ఆఫ్ఘనిస్థాన్… సత్తా చాటిన మానవ్ సుతార్

India vs Afghanistan | 152 పరుగులకే కుప్పకూలిన ఆఫ్ఘనిస్థాన్… సత్తా చాటిన మానవ్ సుతార్

-

Chat on WhatsApp

India vs Afghanistan: ముల్లాన్‌పూర్‌లో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ అద్భుత ఆటతీరుతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు భారీ స్కోరు నమోదు చేయగా, అనంతరం బౌలర్లు చెలరేగడంతో ఆఫ్ఘనిస్థాన్ కష్టాల్లో పడింది.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత శతకంతో 126 పరుగులు సాధించగా, కేఎల్ రాహుల్ 100 పరుగులతో మెరిశాడు. వీరితో పాటు సాయి సుదర్శన్ 81, రిషబ్ పంత్ 81, వాషింగ్టన్ సుందర్ 52 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశారు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో సలీమ్ సాఫి ఆరు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను కొంతవరకు నిలువరించే ప్రయత్నం చేశాడు. అయితే మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్ భారత బౌలర్ల ధాటికి 152 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో రహ్మత్ షా మాత్రమే 60 పరుగులతో పోరాడగా, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. భారత్ తరఫున అరంగేట్ర టెస్టు ఆడుతున్న మానవ్ సుతార్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు.

తన తొలి మ్యాచ్‌లోనే ఆరు వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి అద్భుత బౌలింగ్‌తో ఆఫ్ఘన్ బ్యాటింగ్ కుప్పకూలింది. భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో భారత్ మ్యాచ్‌పై పూర్తిస్థాయి పట్టు సాధించింది. ప్రస్తుతం భారత జట్టు విజయానికి మరింత చేరువగా కనిపిస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp