Saturday, July 25, 2026
Chat on WhatsApp
HomeSportsTravis Head | కోహ్లీతో గొడవా? తొలిసారి నోరు విప్పిన ట్రావిస్ హెడ్.. అసలు నిజం...

Travis Head | కోహ్లీతో గొడవా? తొలిసారి నోరు విప్పిన ట్రావిస్ హెడ్.. అసలు నిజం ఇదే!

-

Chat on WhatsApp

Travis Head: విరాట్ కోహ్లీతో వివాదం, సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై తొలిసారిగా స్పందించిన ట్రావిస్ హెడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ( Virat Kohli), సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య వివాదం నెలకొన్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ హ్యాండ్‌షేక్ చేసుకోలేదనే వీడియోలు వైరల్ కావడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. అయితే ఈ ప్రచారానికి ట్రావిస్ హెడ్ స్వయంగా చెక్ పెట్టాడు.

కోడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోహ్లీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. మైదానంలో జరిగే మాటల యుద్ధం ఆటలో భాగమేనని, దానిని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. తమ మధ్య రాజీ కుదుర్చుకోవాల్సిన పరిస్థితే లేదని, కోహ్లీతో తన సంబంధాలు యథావిధిగా ఉన్నాయని వెల్లడించాడు.

అయితే ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ మాత్రం తనను తీవ్రంగా బాధించిందని హెడ్ తెలిపాడు. ముఖ్యంగా తన భార్య జెస్సికా హెడ్‌ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన అభ్యంతరకర పోస్టులు, సందేశాలు బాధ కలిగించాయని పేర్కొన్నాడు. తాము ఇలాంటి విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులను ఈ వివాదాల్లోకి లాగడం సరికాదని అభిప్రాయపడ్డాడు.

ఈ క్లిష్ట సమయంలో జెస్సికా చూపిన ధైర్యం ప్రశంసనీయమని, కాలక్రమంలో ఈ అంశంపై చర్చలు తగ్గిపోతాయని ఆయన అన్నారు. ఆటగాళ్ల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేయడం మాత్రం ఏ మాత్రం సమంజసం కాదని ట్రావిస్ హెడ్ స్పష్టం చేశాడు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Andhra Pradesh Home Minister Vangalapudi Anitha social media account hacking alert

Vangalapudi Anitha | హోంమంత్రి అనిత ‘ఎక్స్’ అకౌంట్‌ హ్యాక్.. రంగంలోకి సైబర్ టీమ్

Vangalapudi Anitha: హోంమంత్రి పేరుతో వస్తున్న అనధికార పోస్టులపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు చెందిన అధికారిక ‘ఎక్స్’ (X) సామాజిక మాధ్యమ ఖాతా హ్యాక్‌కు గురైనట్లు అధికారులు తెలిపారు....
- Advertisement -
Chat on WhatsApp