ఏపీలో వేసవి ఉద్ధృతమవుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను వేధిస్తున్నాయి. ఇప్పటికే 42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న 105 ప్రాంతాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు మరిన్ని మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎండలో తిరగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. విపత్తుల నిర్వహణ శాఖ 83 మండలాల్లో తీవ్ర వడగాలులు, 208 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ప్రజల మొబైల్ ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపుతోంది.
వడదెబ్బకు గురికాకుండా నీరు, నిమ్మరసం, మజ్జిగ, గ్లూకోజ్, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ లాంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించింది. ఎండకు తగిన జాగ్రత్తలు తీసుకుని, గుడ్డలు లేదా టోపీతో తలను కప్పుకోవాలని తెలిపింది.
ప్రస్తుతం వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. హీట్ వేవ్ ప్రభావం తగ్గేవరకు సురక్షితంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.