CSK vs RR: వీడు మామూలోడు కాదురా బుజ్జి అనే డైలాగ్ గుర్తుందా… ఈ కాప్షన్ కి వైభవ్ సూర్యవంశీ సెట్ అవుతాడు అనే టాక్ నడుస్తుంది. చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతడి ధాటికి మ్యాచ్ ఒక్కసారిగా రాజస్థాన్ వైపు మళ్లిపోయింది. ఇక మ్యాచ్ లోకి వెళ్తే
IPL 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ పూర్తి ఆధిపత్యం చాటింది. గువాహటిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందు బంతితో, తర్వాత బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసిన రాజస్థాన్.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, ఆ నిర్ణయం అచ్చొచ్చినట్టైంది.
బ్యాటింగ్‌కు దిగిన cskకు ఆరంభం నుంచే షాకులు ఎదురయ్యాయి. జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ వేగానికి చెన్నై టాప్ ఆర్డర్ తట్టుకోలేక వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒక దశలో తక్కువ స్కోరుకే కుప్పకూలే పరిస్థితి కనిపించగా, జేమీ ఓవర్టన్ ఒంటరి పోరాటంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
అతడు 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కార్తిక్ శర్మ 18 పరుగులు చేసి కొంత సహకారం అందించాడు. అయినప్పటికీ చెన్నై జట్టు 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది.
రాజస్థాన్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, రవీంద్ర జడేజా తలా 2 వికెట్లు తీసి CSK ను ఒత్తిడిలోకి నెట్టారు. చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
అతడి ధాటికి వార్ వన్ సైడ్ అయిపోయింది. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సూర్యవంశీ, ఆరంభం నుంచే CSK ఆశలను చిదిమేశాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ కూడా చక్కటి సహకారం అందించాడు.
ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ 12.1 ఓవర్లలోనే 128/2 స్కోరు చేసి మ్యాచ్‌ను సునాయాసంగా ముగించింది.
ఈ విజయం ద్వారా RR ఈ సీజన్‌కు బలమైన సంకేతం ఇవ్వగా, csk మాత్రం తమ బ్యాటింగ్‌పై వెంటనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూస్తే.. ఇది రాజస్థాన్ రాయల్స్ నుంచి పూర్తి స్థాయి డామినేషన్ షో అని చెప్పాలి.








