Friday, July 3, 2026
Chat on WhatsApp
HomeBusinessGold Price Today | సామాన్యులకు బంగారం ధర షాక్.. వెండి ధరలో ఊరట

Gold Price Today | సామాన్యులకు బంగారం ధర షాక్.. వెండి ధరలో ఊరట

-

Chat on WhatsApp

దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే కుటుంబాలకు అదనపు భారం తప్పడం లేదు.

ఇక వెండి ధర మాత్రం కొంత ఊరటనిచ్చింది. కిలో వెండిపై రూ.5,000 తగ్గడంతో ప్రస్తుతం వెండి ధర రూ.2,50,000గా ఉంది. బంగారం ఎగిసిపడుతున్న సమయంలో వెండి ధర తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తోంది.

సాధారణంగా డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. నిన్న డాలర్ విలువ రూ.95కు పైగా ట్రేడ్ కావడంతో, ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గుతాయని చాలా మంది అంచనా వేశారు.

అయితే ఆ అంచనాలు తారుమారయ్యాయి. ధర తగ్గాల్సింది పోయి మరింత పెరగడం మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వాతావరణమే. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు పెట్టుబడిదారులను అప్రమత్తం చేస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో షేర్లు, కరెన్సీలు, ఇతర పెట్టుబడుల కంటే బంగారం ‘సేఫ్ హేవెన్’ ఆస్తిగా భావిస్తారు. అందుకే డాలర్ బలపడినా, అంతర్జాతీయంగా బంగారంపై డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా ధరలు కూడా భారీగా ఎగిశాయి.

ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే, బంగారం ధరల్లో సమీప కాలంలో పెద్దగా తగ్గుదల కనిపించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి కొనుగోలుదారులు సరైన సమయం చూసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

indian parliament monsoon session 2026 key bills and political agenda

Parliament Monsoon Session | జూలై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. రాజకీయ వేడి...

దేశ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలకు వేదికగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Session) మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జూలై 20 నుంచి సమావేశాలను నిర్వహించే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు...
- Advertisement -
Chat on WhatsApp