Thursday, August 6, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshQR Code Handicrafts | ఏపీ హస్తకళల్లో డిజిటల్ విప్లవం.. స్కాన్ చేస్తే చాలు హస్తకళ...

QR Code Handicrafts | ఏపీ హస్తకళల్లో డిజిటల్ విప్లవం.. స్కాన్ చేస్తే చాలు హస్తకళ వెనుక పూర్తి కథ మీ మొబైల్‌లో!

-

Chat on WhatsApp

AP Handicrafts: ఆంధ్రప్రదేశ్ హస్తకళలను ప్రపంచ మార్కెట్‌కు మరింత చేరువ చేయడంతో పాటు కళాకారులకు డిజిటల్ గుర్తింపును కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు దేశంలో తొలిసారిగా హస్తకళా ఉత్పత్తులకు QR కోడ్(QR Code Handicrafts) ఆధారిత డిజిటల్ గుర్తింపు వ్యవస్థను ప్రారంభించింది. ‘లేపాక్షి’ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ప్రతి హస్తకళా ఉత్పత్తికి ప్రత్యేక డిజిటల్ ప్రొఫైల్ రూపొందించనున్నారు.

వినియోగదారులు ఉత్పత్తిపై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ కళాఖండానికి సంబంధించిన పూర్తి వివరాలు మొబైల్‌లో అందుబాటులోకి వస్తాయి. కళాఖండం చరిత్ర, సాంస్కృతిక విశిష్టత, దానిని రూపొందించిన కళాకారుడి పేరు, నైపుణ్యం, తయారీ విధానం, ఉపయోగించిన ముడిసరుకు, తయారీకి పట్టిన సమయం, ఉత్పత్తి పరిమాణాలు వంటి సమాచారం అందుతుంది. అలాగే జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్, One District One Product (ODOP) కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. మొదటి దశలో బొబ్బిలి వీణ, కలంకారి పెయింటింగ్స్, సవర ఆదివాసీ పెయింటింగ్స్ సహా రాష్ట్రంలోని ఎనిమిది ప్రముఖ హస్తకళా ఉత్పత్తులకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

రాబోయే రోజుల్లో అన్ని హస్తకళా ఉత్పత్తులకు ఈ వ్యవస్థను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిజిటల్ వ్యవస్థతో నకిలీ ఉత్పత్తులను గుర్తించడం సులభమవుతుందని, అసలైన హస్తకళల ప్రామాణికతపై వినియోగదారులకు నమ్మకం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా స్థానిక కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, మెరుగైన మార్కెట్ అవకాశాలు, అధిక ఆదాయం లభించేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!

UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు...
- Advertisement -
Chat on WhatsApp