Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeTelanganaAdilabadఉట్నూర్ లో PM విశ్వకర్మ పథకం వార్షికోత్సవం ఘనంగా

ఉట్నూర్ లో PM విశ్వకర్మ పథకం వార్షికోత్సవం ఘనంగా

-

Chat on WhatsApp

ఉట్నూర్ కుల వృత్తులు, చేతి వృత్తులు వారికి వరం, స్వయం ఉపాధి కి భరోసా ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం.

సెప్టెంబర్ 2 వ తేది నుండి 10 వ తేదీ వరకు మొదటి విడత శిక్షణ పొందిన వృత్తి కళాకారులు 21 మంది కి సర్టిఫికెట్స్ పంపిణి చేసిన పార్లమెంటు సభ్యులు గోడెం నగేష్, శాసన సభ్యులు వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్.
PM విశ్వకర్మ తొలి వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌ లోని పీఎంఆర్‌సీ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు గోడెం నగేశ్ , శాసన సభ్యులు వేడ్మ బోజ్జు ఖానాపూర్, పాయల్ శంకర్ , అదిలాబాద్, జిల్లా పాలనాధికారి రాజర్షి షా , విద్యానంద్ జాయింట్ డైరెక్టర్ RDSD హైదరాబాద్, సీతారాములు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్, శ్రీనివాస్ రొడ్డ ప్రిన్సిపల్ FAC ప్రభుత్వ ITI ఉట్నూర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వార్ధా, మహారాష్ట్ర నుంచి వర్చువల్‌గా కార్యక్రమాన్నిప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ప్రసంగిస్తూ మహారాష్ట్ర లోని వార్ధ నుండి భారత ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రాంభించి మాట్లాడారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన LED తెర మీద ప్రధాన మంత్రి కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రసారం ద్వారా వీక్షించడం జరిగిందనీ ఆన్నారు.
ఉట్నూర్ ITI కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం, నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్ కు తమ నైపుణ్యం తో మెరుగులు దిద్ది ఉపయోగం లోకి తెచ్చారని అభినందించారు.

శాసనసభ్యులు వెడ్మ బొజ్జ, పాయల్ శంకర్ లు మాట్లాడుతూ గత సంవత్సరం సెప్టెంబర్ 17 న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందనీ, 18 రకాల సంప్రదాయ చేతి వృత్తులు వారు ఈ పథకానికి అర్హులని ఆన్నారు.
చేతి వృత్తి కళాకారుల ఉత్పత్తుల నాణ్యతను పెంచి, వారిని దేశీయ, గ్లోబల్ మార్కెట్ తో అనుసంధానం చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆన్నారు.ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sandeep Reddy Vanga and Prabhas at a movie screening reacting to Dhurandhar 2 controversy

Sandeep Reddy Vanga | ప్రభాస్‌తో సినిమా చూసిన వంగా.. విమర్శకులపై ఘాటు వ్యాఖ్యలు

Sandeep Reddy Vanga: దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి తన ఘాటు వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. తాజాగా దేశవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘ధురంధర్ 2’(Dhurandhar 2) సినిమాను ఆయన...
- Advertisement -
Chat on WhatsApp