LIVE
Sunday, November 15, 2026
LIVE
LIVE

Pawan Kalyan | “హీరోగా మారకముందే నాకు హీరో”.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!

by Bajaswamy
10 views
Pawan Kalyan shares emotional memories of Megastar Chiranjeevi on his birthday.

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) పంచుకున్న జ్ఞాపకాలు అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. అన్నయ్య తన జీవితంపై చూపిన ప్రభావాన్ని గుర్తుచేసుకున్న పవన్.. చిరంజీవి తనకు హీరోగా మారకముందే హీరో అని పేర్కొన్నారు. చిరంజీవి కాలేజీ కోసం నర్సాపూర్ వెళ్లిన రోజులను గుర్తుచేసుకుంటూ.. ఆయన సెలవులకు ఇంటికి వస్తే తమ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొనేదని, తిరిగి వెళ్లినప్పుడు ఇల్లు వెలవెలబోయేదని పవన్ తెలిపారు. చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లే సమయంలో చిరంజీవి పక్కన నడవడం తనకు ఎంతో గర్వంగా ఉండేదన్నారు. తండ్రి బుల్లెట్‌పై పొడవాటి జుట్టు, కళ్లద్దాలతో ఎన్‌సీసీ క్యాడెట్‌లా చిరంజీవి కనిపిస్తే తాను అభిమానిలా మురిసిపోయేవాడినని చెప్పారు.

సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో చిరంజీవి సింగపూర్‌ నుంచి తిరిగి వచ్చేటప్పుడు తన కోసం లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కామిక్స్, మ్యూజిక్ క్యాసెట్లు, టేప్ రికార్డర్ వంటి బహుమతులు తీసుకొచ్చిన విషయాన్ని పవన్ గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యుల కోసం కూడా చిన్నచిన్న కానుకలు తెచ్చేవారని తెలిపారు. చిరంజీవి వివాహ సమయంలో అన్నయ్య తమకు దూరమవుతారనే బాధతో తాను ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాన్ని కూడా పవన్ పంచుకున్నారు. ఆ సమయంలో చిరంజీవి తన భార్య సురేఖను తీసుకొచ్చి పరిచయం చేసిన తీరు ఇప్పటికీ గుర్తుందని చెప్పారు. అనంతరం చెన్నైలో చిరంజీవి, సురేఖ తనపై చూపిన ప్రేమ, ఆప్యాయతకు మాటలు సరిపోవని పవన్ పేర్కొన్నారు. కుటుంబం కోసం అన్నయ్య చేసిన త్యాగాలు, తమపై చూపిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన భావోద్వేగంగా తెలిపారు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More