Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsVivo X300e 5G దుమ్మురేపుతోంది.. కెమెరా, బ్యాటరీ ఫీచర్లు సూపర్!, ధర సస్పెన్స్ ?

Vivo X300e 5G దుమ్మురేపుతోంది.. కెమెరా, బ్యాటరీ ఫీచర్లు సూపర్!, ధర సస్పెన్స్ ?

-

Chat on WhatsApp

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Vivo X300e 5Gతో వివో మరో కొత్త ఫ్లాగ్‌షిప్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే X300, X300 Pro మోడళ్లను విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు ప్రీమియం ఫీచర్లతో X300eను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. తొలి సేల్ జూలై 27 ఉదయం 9 గంటలకు జరగనుండగా, ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు.

Vivo X300e 6.59 అంగుళాల 1.5K ఫ్లాట్ OLED డిస్‌ప్లేతో మార్కెట్లోకి వచ్చింది. పనితీరు కోసం Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను అమర్చారు. గేమింగ్, మల్టీటాస్కింగ్, AI ఆధారిత యాప్స్‌ను వేగంగా నిర్వహించే సామర్థ్యం ఈ చిప్‌సెట్‌కు ఉంది. ఫోటోగ్రఫీ కోసం ZEISS టెక్నాలజీతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కంపెనీ అందించింది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరాను కూడా ఇచ్చారు.

ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణ 7200mAh భారీ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు ఉపయోగించుకునేలా రూపొందించగా, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తక్కువ సమయంలోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. 7.99 మిల్లీమీటర్ల స్లిమ్ డిజైన్, మెటల్ ఫ్రేమ్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో ప్రీమియం లుక్‌ను అందించింది. ధర ప్రకటించకపోయినా, ఫ్లాగ్‌షిప్ విభాగంలో ఈ ఫోన్ మంచి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Amitabh Bachchan addressing health rumours

Amitabh Bachchan | ‘నేను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నా’.. వైరల్ వార్తలపై అమితాబ్ స్పందన

Bollywood: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలకు స్వయంగా స్పందించారు. తనకు ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదని, ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం...
- Advertisement -
Chat on WhatsApp