Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeTelanganaCM Revanth Reddy | ప్రతి ఓటరికి సీఎం రేవంత్ సూచన.. SIRను నిర్లక్ష్యం చేయొద్దు

CM Revanth Reddy | ప్రతి ఓటరికి సీఎం రేవంత్ సూచన.. SIRను నిర్లక్ష్యం చేయొద్దు

-

Chat on WhatsApp

CM Revanth Reddy: తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా SIR ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత బూత్ లెవల్ అధికారి (BLO)కి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు కూడా ఆలస్యం చేయకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఓటరు జాబితాలో పేరు నమోదు కాకపోతే లేదా అవసరమైన వివరాలు సమర్పించకపోతే భవిష్యత్తులో ఓటు హక్కు వినియోగించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

అందువల్ల ప్రతి అర్హత కలిగిన ఓటరు SIR ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులపై ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Actor Naresh speaking about the Chalo Parliament protest violence

Actor Naresh | ‘ఛలో పార్లమెంట్’ హింసపై నటుడు నరేశ్ ఫైర్.. “దీని వెనుక...

Actor Naresh: ఢిల్లీలో 'ఛలో పార్లమెంట్'(Chalo Parliament) పేరుతో జరిగిన ఆందోళనల్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై సినీ నటుడు నరేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బారికేడ్లను దాటుకుని పార్లమెంట్ వైపు నిరసనకారులు వెళ్లేందుకు...
- Advertisement -
Chat on WhatsApp