HomeAndhra PradeshYS Jagan | పులివెందులలో జగన్ మూడు రోజుల పాటు పర్యటన… షెడ్యూల్ ఇదే

YS Jagan | పులివెందులలో జగన్ మూడు రోజుల పాటు పర్యటన… షెడ్యూల్ ఇదే

-

Chat on WhatsApp

YS Jagan: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు పులివెందుల ప్రాంతంలో ప్రజలతో మమేకం కానున్నారు. ఈ పర్యటనలో ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించారు. పర్యటనలో భాగంగా 23వ తేదీ సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న జగన్, భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, వినతులను స్వీకరించనున్నారు. అనంతరం పులివెందులలోని తన నివాసంలో బస చేయనున్నారు. మరుసటి రోజు ఉదయం వేముల మండలంలోని భూమయ్యగారిపల్లెకు వెళ్లనున్న ఆయన, అక్కడ నిర్వహించనున్న గట్టు లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నూతన దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆలయ మహోత్సవాల్లో పాల్గొన్న తర్వాత ఆయన తిరిగి పులివెందులకు చేరి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 25వ తేదీ ఉదయం పులివెందుల నుంచి ఆయన తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ మూడు రోజుల పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలపై ఆరా తీసే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే పలు స్థానిక అంశాలపై కూడా జగన్ స్పందించే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పులివెందుల ప్రాంతంలో పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించాయి.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

KTR receiving an invitation to attend Bathukamma celebrations in Dubai as chief guest.

KTR | గల్ఫ్ గడ్డపై బతుకమ్మ సందడి.. ముఖ్య అతిథిగా కేటీఆర్!

KTR: తెలంగాణ సంస్కృతికి దుబాయ్ వేదికగా మరోసారి ఘనంగా బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు యూఏఈకి చెందిన ఎమిరేట్స్ తెలంగాణ...
- Advertisement -
Chat on WhatsApp