HomeAndhra Pradesh'క్విట్ ఇండియా' స్ఫూర్తిని గుర్తుచేసిన పవన్ కల్యాణ్.. ఐక్యతే భారత బలం అంటూ ట్వీట్

‘క్విట్ ఇండియా’ స్ఫూర్తిని గుర్తుచేసిన పవన్ కల్యాణ్.. ఐక్యతే భారత బలం అంటూ ట్వీట్

-

Chat on WhatsApp

Quit India Movement: క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 1942లో భారత స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరి పోసిన చారిత్రక ఘట్టాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) గుర్తు చేశారు. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధన కోసం ప్రతి భారతీయుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ ఇచ్చిన ‘ (Do or Die) పిలుపు భారతీయులలో అపారమైన ధైర్యాన్ని, అచంచల దేశభక్తిని నింపిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అదే పిలుపు స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రజల ఉద్యమంగా మార్చి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐక్య పోరాటానికి నాంది పలికిందన్నారు.

ప్రజల సామూహిక సంకల్పం, జాతీయ గర్వం, ఐక్యతలోనే భారత అసలైన బలం ఉందని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళి అంటే స్వయం సమృద్ధి, ఆత్మనిర్భరత, అభివృద్ధి దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని అభిప్రాయపడ్డారు. ఐక్యమైన, బలమైన, అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Prime Minister Narendra Modi addressing students at IIT Delhi's 57th convocation ceremony.

IIT Delhi Convocation | టెక్నాలజీ మారుతోంది.. మీరు కూడా మారాలి: ఐఐటీ కాన్వొకేషన్‌లో...

IIT Delhi Convocation: వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం తప్పనిసరని ప్రధాని నరేంద్ర మోడీ యువతకు సూచించారు. ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన, పట్టభద్రులను...
- Advertisement -
Chat on WhatsApp