Rajya Sabha election schedule: దేశవ్యాప్తంగా ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లో జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, గుజరాత్లో నాలుగు, కర్ణాటకలో నాలుగు, మధ్యప్రదేశ్లో మూడు, జార్ఖండ్లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మిగతా రాష్ట్రాల్లో కూడా ఖాళీల ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల కోసం జూన్ 1న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 8 వరకు నామినేషన్ల దాఖలు గడువు ఉండగా, జూన్ 9న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. అభ్యర్థులు జూన్ 11 వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.
జూన్ 18న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ చర్చలు వేడెక్కే అవకాశముంది.








