Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeInterNationalDonald Trump | బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎందుకు ధరించడంలేదు? ట్రంప్ వివరణ

Donald Trump | బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎందుకు ధరించడంలేదు? ట్రంప్ వివరణ

-

Chat on WhatsApp

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించకపోవడంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. బహిరంగ కార్యక్రమాల్లో భద్రతా కారణాల దృష్ట్యా జాకెట్ ధరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, తాను దాన్ని ధరించడాన్ని ఇష్టపడనని ట్రంప్ తెలిపారు.

ఆ జాకెట్ వేసుకుంటే తాను మరింత బరువుగా, దాదాపు 20 పౌండ్లు ఎక్కువగా కనిపిస్తానని, అది తనకు నచ్చదని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.

గురువారం ఓవల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఓ జర్నలిస్టు ఈ విషయంపై ప్రశ్నించగా, ట్రంప్ ఈ విధంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలకు అక్కడ ఉన్న విలేకరులు, కాంగ్రెస్ సభ్యులు నవ్వులు పూయించారు. అయితే భద్రతా అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం లేదని, అది పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయమేనని కూడా ఆయన అంగీకరించారు.

“చాలామంది ఈ విషయం గురించి నన్ను అడిగారు. కానీ నేను అలా చేయడం ఇష్టపడను. అలా చేస్తే ఒక చెడు శక్తికి లొంగిపోయినట్లుగా భావిస్తాను” అని ట్రంప్ తెలిపారు. భద్రతా జాగ్రత్తలు అవసరమని తెలుసు కానీ భయంతో జీవించలేనని ఆయన స్పష్టం చేశారు.

ఇదే సందర్భంలో మరోసారి దాడి జరిగే అవకాశంపై ఆందోళన ఉందా అని ప్రశ్నించగా, అలాంటి ఆలోచనలను తాను పట్టించుకోనని ట్రంప్ తెలిపారు. అలా ఆలోచిస్తే తన పని సమర్థవంతంగా చేయలేనని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ట్రంప్‌పై రెండు సార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Chandrababu | చీరాల వేదికగా సీఎం హామీ.. చేనేత వైభవాన్ని తిరిగి తీసుకొస్తాం 

CM Chandrababu: చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ‘నేతన్న సేవలో’...
- Advertisement -
Chat on WhatsApp