Bangladesh: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై భారత్‌లోనే కాకుండా పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వస్తే తమ దేశంపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న అంశంపై అక్కడి రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
బంగ్లాదేశ్ ఎన్‌సీపీ కార్యదర్శి, ఎంపీ అక్తర్ హుస్సేన్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే అక్రమ బంగ్లాదేశీయులను తిరిగి పంపించే చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో వలసదారులు బంగ్లాదేశ్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎగ్జిట్ పోల్స్ సూచించిన ఫలితాల ప్రకారం బెంగాల్‌లో బీజేపీ విజయం సాధిస్తే లక్షలాది మంది అక్రమ వలసదారులు తిరిగి బంగ్లాదేశ్‌లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇది ఢాకాలో శరణార్థుల సంక్షోభాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.
ఇక ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే తీవ్రంగా స్పందించారు. అక్రమ చొరబాట్ల విషయంలో తృణమూల్ కాంగ్రెస్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. తృణమూల్‌కు అనుబంధంగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఇప్పుడు బయటపడుతున్నారని ఆరోపించారు. అక్తర్ హుస్సేన్ వ్యాఖ్యల వీడియోను కూడా ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో షేర్ చేశారు.
Bangladesh | బీజేపీ గెలిస్తే ఏం జరుగుతుంది..? బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న ఆందోళన
-








