Rowdy Janardhan: విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ జనార్దన్’(Rowdy Janardhan) నుంచి మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా విడుదలైన పోస్టర్లో విజయ్ దేవరకొండ ప్రేమభరిత లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. “ప్రపంచంతో యుద్ధం చేస్తాడు.. కానీ ప్రేమ ముందు ఓడిపోతాడు” అనే క్యాప్షన్‌తో చిత్రబృందం ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపింది.
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా 1980ల నాటి కథాంశంతో తెరకెక్కుతోంది.
ఇటీవల దిల్ రాజు మాట్లాడుతూ, విజయ్ ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసినప్పటికీ, పూర్తి స్థాయి మాస్ పాత్రలో మాత్రం కనిపించలేదని తెలిపారు. ‘రౌడీ జనార్దన్’లో తొలిసారిగా ఆయనను తూర్పు గోదావరి యాసలో మాట్లాడించనున్నట్లు వెల్లడించారు.
కథ విన్న వెంటనే ఇది చాలా కొత్తగా అనిపించిందని, ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని ఇస్తుందని దిల్ రాజు చెప్పారు. 1980ల కాలం నాటి వాతావరణాన్ని తెరపై అద్భుతంగా చూపించేందుకు సాంకేతిక బృందం ఎంతో కష్టపడిందని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, విజయ్ అభిమానులు సినిమాపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు.
