Sunday, August 2, 2026
Chat on WhatsApp
HomeNationalVijay and Sangeeta | విజయ్–సంగీత విడాకుల కేసు మరోసారి వాయిదా.. ఎందుకంటే ?

Vijay and Sangeeta | విజయ్–సంగీత విడాకుల కేసు మరోసారి వాయిదా.. ఎందుకంటే ?

-

Chat on WhatsApp

Vijay and Sangeeta: తమిళ సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ మరియు ఆయన భార్య సంగీత విజయ్ మధ్య కొనసాగుతున్న విడాకుల కేసు మరోసారి వాయిదా పడింది. చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో జరిగిన సోమవారం విచారణలో ప్రాధాన్యమైన పురోగతి లేకపోవడంతో, కేసును ఆగస్టు 7కి మార్చారు. ఈ కేసు ఇప్పటికే తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు పూర్తి స్థాయి వాదనలు వినిపించలేదు.

తదుపరి విచారణలో తమ వాదనలు సమర్పించనున్నట్లు సమాచారం. దీంతో కేసు భవిష్యత్ పరిణామాలపై ఇంకా స్పష్టత రాలేదు. విజయ్, సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమారు 25 సంవత్సరాలకు పైగా కొనసాగిన ఈ దాంపత్య బంధం ఇప్పుడు న్యాయస్థానానికి చేరడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు పత్రాలు వెల్లడించాయి.

ఇక ఈ కేసు ప్రారంభమైనప్పటి నుంచి ఇరువురి మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం సోషల్ మీడియాలో కొనసాగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు విజయ్ లేదా సంగీత నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ఈ వార్తలను అధికారికంగా ధృవీకరించలేమని న్యాయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి ఆగస్టు 7న జరిగే తదుపరి విచారణపై నిలిచింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp