Shreyas Iyer: జింబాబ్వే పర్యటనను టీమిండియా విజయంతో ప్రారంభించింది. తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్,(IND vs ZIM) సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా విజయానికి దూరమైన శ్రేయస్ అయ్యర్‌కు ఇది తొలి గెలుపు కావడం విశేషం. ఈ విజయానికి యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి భారత విజయంలో విజయంలో హీరోగా నిలిచాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్, జట్టు ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు ముందుగా రూపొందించిన ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశారని, కెప్టెన్‌గా తొలి విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. వైభవ్ బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూ అతడు భయపడకుండా ఆడాడని, గత అనుభవం అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని అన్నాడు. గాయం నుంచి తిరిగొచ్చిన మయాంక్ యాదవ్ కూడా కొత్త బంతితో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టుకు మంచి ఆరంభం అందించాడని కొనియాడాడు.
ఈ మ్యాచ్‌తో శ్రేయస్ అయ్యర్ మరో అరుదైన రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో వరుసగా టాస్ గెలిచిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఏడు టాస్ విజయాలతో ఎంఎస్ ధోనీ, బహమాస్ కెప్టెన్ గ్రెగొరీ టేలర్ పేరిట ఉండగా, శ్రేయస్ ఆ రికార్డును అధిగమించాడు.
ALSO READ: Narendra Modi | పేపర్ లీక్ మాఫియాకు కౌంట్‌డౌన్.. కొత్త చట్టంపై మోడీ సర్కార్ కీలక నిర్ణయం








