Saturday, July 25, 2026
Chat on WhatsApp
HomeNationalMohan Bhagwat | పిల్లల ప్రశ్నలకు పేరెంట్స్ వద్ద సమాధానాలున్నాయా?.. మోహన్ భగవత్ ప్రశ్న

Mohan Bhagwat | పిల్లల ప్రశ్నలకు పేరెంట్స్ వద్ద సమాధానాలున్నాయా?.. మోహన్ భగవత్ ప్రశ్న

-

Chat on WhatsApp

Mohan Bhagwat: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కొత్త తరానికి ఎలా చేరవేయాలనే అంశంపై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పిల్లలు, యువత ప్రతి సంప్రదాయం వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారని మోహన్ భగవత్ అన్నారు. గుడ్డిగా నమ్మే రోజులు పోయాయని, పిల్లలు దేవుళ్ల రూపాలు, సంప్రదాయాల వెనుక ఉన్న అర్థం గురించి తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. “దేవుళ్లకు కోతి లేదా ఏనుగు ముఖాలు ఎందుకు ఉంటాయి?” ఇలాంటి సందేహాలకు చాలా మంది తల్లిదండ్రుల వద్ద స్పష్టమైన వివరణ లేకపోతోందని ఆయన పేర్కొన్నారు. 

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ధర్మం, భారతీయ సంస్కృతి, పురాణాల్లోని ప్రతీకల భావాన్ని చిన్నప్పటి నుంచే విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం పాఠశాల సిలబస్‌లో సంస్కృతి, ఆధ్యాత్మిక అంశాలకు చోటు కల్పించాలని సూచించారు. అలాగే పిల్లల సందేహాలను నిర్లక్ష్యం చేయకుండా, వారి ఆలోచనా విధానానికి అనుగుణంగా వివరించే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెప్పారు. ధర్మం, సంప్రదాయాలను నేటి తరానికి అర్థమయ్యే భాషలో వివరించగలిగితేనే వాటి విలువలు భవిష్యత్ తరాలకు చేరుతాయని మోహన్ భగవత్ పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Andhra Pradesh Home Minister Vangalapudi Anitha social media account hacking alert

Vangalapudi Anitha | హోంమంత్రి అనిత ‘ఎక్స్’ అకౌంట్‌ హ్యాక్.. రంగంలోకి సైబర్ టీమ్

Vangalapudi Anitha: హోంమంత్రి పేరుతో వస్తున్న అనధికార పోస్టులపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు చెందిన అధికారిక ‘ఎక్స్’ (X) సామాజిక మాధ్యమ ఖాతా హ్యాక్‌కు గురైనట్లు అధికారులు తెలిపారు....
- Advertisement -
Chat on WhatsApp