Monday, July 20, 2026
Chat on WhatsApp
HomeTelanganaNIMS Hospital | నిమ్స్‌లో బాలింతలను పరామర్శించిన హరీశ్‌రావు.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా

NIMS Hospital | నిమ్స్‌లో బాలింతలను పరామర్శించిన హరీశ్‌రావు.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా

-

Chat on WhatsApp

హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి(NIMS Hospital)లో చికిత్స పొందుతున్న బాలింతలను మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం వైద్యులను కలిసి బాధితుల చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి బాలింతకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.

ఇటీవల జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, బాలింతలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ నెల 13న జరిగిన సిజేరియన్ శస్త్రచికిత్సల అనంతరం ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురికావడంతో వారిని నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

JP Nadda meeting CJP leaders in New Delhi

JP Nadda | జేపీ నడ్డాతో సీజేపీ నేతల భేటీ.. డిమాండ్లపై సానుకూల స్పందన?

JP Nadda: కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ నాయకుల ప్రతినిధి బృందం సమావేశమై తమ ప్రధాన డిమాండ్లను వినిపించింది. చర్చలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు, ప్రభుత్వం తమ...
- Advertisement -
Chat on WhatsApp