కాసు బ్రహ్మనందరెడ్డి (KBR Park) నేషనల్ పార్క్ వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్క్ పరిధిలో చెట్ల నరికివేతను తక్షణమే ఆపేయాలని స్పష్టం చేస్తూ స్టే ఆర్డర్లు ఇచ్చింది. తదుపరి విచారణ జరిగే వరకు పార్క్‌కు 35 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు లేదా పనులు చేపట్టవద్దని అధికార యంత్రాంగానికి ఆదేశించింది.
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణం, అండర్‌పాస్ పనులు చేపట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికల నేపథ్యంలో ఈ వివాదం కొనసాగుతోంది. ఎస్‌ఆర్‌డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్)లో భాగంగా ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఈ ప్రాజెక్ట్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రారంభించింది. ఈ క్రమంలో చెట్ల నరికివేతపై పర్యావరణ వేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ఈ కేసును విచారించి స్టే ఆర్డర్ జారీ చేసింది. ఎకో సెన్సిటివ్ జోన్ నిబంధనల ప్రకారం 25–35 మీటర్ల పరిధిలో చెట్లను నరకకూడదని కోర్టు గుర్తు చేసింది. తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.
ఈ ఆదేశాలతో కేబీఆర్ పార్క్ చుట్టూ జరుగుతున్న నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్య సమతుల్యతపై ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ALSO READ:ఆవేశం వద్దు…సినిమాటోగ్రాఫి నియామకం పై స్పందించిన రాఘవ లారెన్స్








