Sunday, July 19, 2026
Chat on WhatsApp
HomeTelanganaRythu Bharosa | రైతు భరోసా మూడో విడత విడుదల.. 6.39 లక్షల మంది రైతులకు...

Rythu Bharosa | రైతు భరోసా మూడో విడత విడుదల.. 6.39 లక్షల మంది రైతులకు లబ్ధి

-

Chat on WhatsApp

Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో లక్షలాది మంది రైతులకు ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం, తాజాగా మూడో విడత నిధులను విడుదల చేసింది. ఈ విడతలో 3 నుంచి 4 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన అర్హులైన రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియ ప్రారంభమైంది.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 6.39 లక్షల మంది రైతులకు మొత్తం రూ.1,330.32 కోట్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో జమ చేస్తున్నారు. దీంతో రైతులు వ్యవసాయ పనులకు అవసరమైన పెట్టుబడిని సకాలంలో వినియోగించుకునే అవకాశం లభించనుంది.

ఇంతకుముందు మొదటి విడతలో రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు, రెండో విడతలో మూడు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా సాయం అందించింది. మూడు విడతలు కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలోని 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్ల ఆర్థిక సహాయం ప్రభుత్వం విడుదల చేసింది.

మిగిలిన అర్హులైన రైతులకు కూడా భూమి విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని దశలవారీగా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులపై పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడమే ఈ పథకం ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తిగా కొనసాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ALSO READ: South Central Railway | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు


- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh meeting Pawan Kalyan during his recovery after shoulder surgery

Nara Lokesh | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Nara Lokesh: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని...
- Advertisement -
Chat on WhatsApp