Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeTelanganaHeavy Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు భారీ వర్ష సూచన

Heavy Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు భారీ వర్ష సూచన

-

Chat on WhatsApp

Heavy Rains: వర్షాలు లేక ఎండలతో సతమతమైన తెలంగాణకు ఇప్పుడు ప్రకృతి కరుణించనున్నట్లు తాజా వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జూలై 3 నుంచి 5వ తేదీ వరకు పలుచోట్ల విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వెల్లడించింది.

ఈసారి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ సీజన్‌లో తొలిసారిగా పలుచోట్ల గంటల తరబడి కొనసాగే ముసురు వానలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

పింక్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో 100 నుంచి 120 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 50 నుంచి 80 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బ్లూ అలర్ట్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో 15 నుంచి 45 మిల్లీమీటర్ల వరకు మోస్తరు వర్షాలు నమోదవుతాయని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశముంది.

హైదరాబాద్ నగరంలో కూడా వచ్చే మూడు రోజుల పాటు మేఘావృత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని అంచనా. ఉదయం, మధ్యాహ్నం సమయంలో చిరుజల్లులు పడే అవకాశం ఉండగా, సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వర్షాలు వ్యవసాయానికి, భూగర్భ జలాల పునరుద్ధరణకు ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp