కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని జొన్నవాడ సెంటర్ వద్ద ఉన్న ఎస్ ఎస్ గ్రాండ్ ఇన్ హోటల్ ను నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిలువ ఉంచిన ఆహారాన్ని సరఫరా చేస్తున్నారని ఓ కస్టమర్ ఫిర్యాదు చేసాడు. కమిషనర్ తనిఖీ చేయగా ఫ్రిజ్లో పెట్టిన చికెన్, నూడుల్స్, భోజనాన్ని నిర్విర్యం చేశారు. యజమానికి పెనాల్టీ విధించి మరోసారి ఇలా చేస్తే కేసు పెడతామని హెచ్చరించారు. పట్టణంలోని వ్యాపారస్తులు కూడా ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలని సూచించారు.








