Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeWeatherSouthwest Monsoon | వర్షాల కోసం ఎదురుచూపులు.. కేరళకు జూన్ 4 నాటికి వర్షాలు

Southwest Monsoon | వర్షాల కోసం ఎదురుచూపులు.. కేరళకు జూన్ 4 నాటికి వర్షాలు

-

Chat on WhatsApp

తాజా నివేదికల ప్రకారం ఈ ఏడాది నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) ఐఎండీ కీలక హెచ్చరిక జారీచేసింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి కేరళను తాకే నైరుతి రుతుపవనాలు, ఈసారి జూన్ 4వ తేదీ వరకు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిపింది.

వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా మేఘాల కదలికలు మందగించినట్లు ఐఎండీ పేర్కొంది. దీంతో కేరళతో పాటు తమిళనాడు, అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతాలకు కూడా రుతుపవనాల ప్రవేశం ఆలస్యమవుతుందని అంచనా వేస్తోంది.

గతంలో మే 26 నాటికి రుతుపవనాలు వస్తాయని అంచనా వేసినా, తాజా పరిస్థితుల నేపథ్యంలో మే 29న ఐఎండీ కొత్త అప్డేట్ విడుదల చేసింది. ఇప్పుడు జూన్ 4 వరకు మోన్సూన్ ప్రవేశం జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

అలాగే ఈసారి వానాకాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని గత వారం ఐఎండీ ముందస్తు అంచనాల్లో తెలిపింది. దీంతో రైతులు, వాతావరణ నిపుణులు పరిస్థితిని గమనిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp