LIVE
Saturday, November 14, 2026
LIVE
LIVE

Siddhu Jonnalagadda 10th Movie | సిద్దు జొన్నలగడ్డకు సుకుమార్ సపోర్ట్.. గ్రాండ్‌గా కొత్త సినిమా ప్రారంభం!

by Bajaswamy
7 views
Siddhu Jonnalagadda begins his 10th film

Siddhu Jonnalagadda 10th Movie: యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. తన కెరీర్‌లో పదో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ‘సిద్దు 10’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి మోహన్ బి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి సిద్దు ఓ అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. కథలోని ప్రత్యేకతలు, ఆయన పోషించనున్న పాత్రకు సంబంధించిన వివరాలను చిత్రబృందం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ దర్శకుడు సుకుమార్ భాగస్వామ్యం కావడం ఆసక్తిని పెంచుతోంది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంస్థలతో కలిసి సిద్దు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుకుమార్ సతీమణి తబిత సుకుమార్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

సినిమా ప్రారంభోత్సవ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకుడు బుచ్చిబాబు సానా చిత్రబృందానికి స్క్రిప్ట్ అందించగా, నిర్మాత అల్లు అరవింద్ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేసి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘డీజే టిల్లు’ సినిమాతో తనదైన కామెడీ టైమింగ్, ప్రత్యేకమైన నటనతో యువతకు దగ్గరైన సిద్దు.. ఆ తర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు పదో సినిమాతో ప్రేమకథను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇందులో ప్రేమ, భావోద్వేగాలు, వినోదం ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి. సిద్దును సరికొత్త పాత్రలో దర్శకుడు మోహన్ బి ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, ఇతర వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More