RCB Coach Basu Shankar: ఐపీఎల్ 2026 సీజన్‌లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు అనూహ్య పరిణామం ఎదురైంది. జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ బసు శంకర్ తన పదవికి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫ్రాంచైజీలో భావోద్వేగ వాతావరణం నెలకొంది.
ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీ అధికారికంగా ఎక్స్ వేదికగా ధృవీకరించింది. బసు శంకర్ నిర్ణయం తమకు తీవ్ర భావోద్వేగాన్ని కలిగించిందని పేర్కొంటూ, జట్టు విజయంలో ఆయన పాత్రను ప్రత్యేకంగా గుర్తు చేసింది. విజయం వెనుక ఆయన అహర్నిశల శ్రమ, కఠినమైన ట్రైనింగ్ ప్రణాళికలు కీలకంగా నిలిచాయని ఆర్సీబీ తెలిపింది. 2019లో ఆర్సీబీతో ప్రయాణం ప్రారంభించిన బసు శంకర్, దాదాపు ఎనిమిది సీజన్ల పాటు జట్టుకు సేవలందించారు.
ఈ కాలంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్ స్థాయిని పెంచడంలో, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆర్సీబీ వరుస విజయాలు సాధించడంలో కూడా ఆయన కృషి ప్రధాన కారణంగా నిలిచింది. దీనికి ముందు ఆయన భారత క్రికెట్ జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ హెడ్ కోచ్‌గా పనిచేశారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ‘యో-యో టెస్ట్’ను భారత జట్టులో ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
టీమిండియా ఫిట్‌నెస్ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన సేవలు ఎంతో కీలకమైనవి. విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రయాణంలో కూడా బసు శంకర్ మార్గదర్శక పాత్ర పోషించారు. ఆయన రిటైర్మెంట్‌తో ఆర్సీబీ జట్టులో ఒక కీలక అధ్యాయం ముగిసినట్లయింది.
ALSO READ:KTR | పవన్ కల్యాణ్‌పై కేటీఆర్ ఫైర్.. తెలంగాణ భూమి పుత్రులదేనని స్పష్టీకరణ








