Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeSportsPV Sindhu | సింధు సూపర్ షో.. జపాన్ ఓపెన్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో!

PV Sindhu | సింధు సూపర్ షో.. జపాన్ ఓపెన్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో!

-

Chat on WhatsApp

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు(PV Sindhu) మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. జపాన్ ఓపెన్ సూపర్ 750(Japan Open Super 750) టోర్నీ చరిత్రలో ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత మహిళా షట్లర్‌గా నిలిచి కొత్త మైలురాయిని సృష్టించింది. శనివారం జరిగిన సెమీఫైనల్‌లో చైనాకు చెందిన చెన్ యుఫీయ్‌ను ఎదుర్కొన్న సింధు ఆరంభం నుంచే ధైర్యంగా ఆడింది.


అంతర్జాతీయ టైటిల్‌కు అడుగు దూరంలో

తొలి సెట్‌ను 21-19తో సొంతం చేసుకున్న ఆమె, రెండో సెట్‌లో కూడా 15-10తో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగింది. ఇదే సమయంలో చెన్ యుఫీయ్ గాయపడటంతో మ్యాచ్‌ను మధ్యలోనే విరమించుకుంది. ప్రత్యర్థి రిటైర్డ్ హర్ట్‌గా తప్పుకోవడంతో సింధు విజయం ఖరారై ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ విజయంతో జపాన్ ఓపెన్‌లో భారత మహిళా బ్యాడ్మింటన్‌కు కొత్త చరిత్ర రాసిన ఆటగాడిగా సింధు నిలిచింది. అంతేకాకుండా మరో అంతర్జాతీయ టైటిల్‌కు ఆమె ఒక్క అడుగు దూరంలో నిలవడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫైనల్‌లో కూడా ఇదే జోరు కొనసాగించి ట్రోఫీని సొంతం చేసుకోవాలని భారత అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

RBI is preparing to test polymer currency notes

Polymer Notes | ఇక కాగితం కాదు.. ప్లాస్టిక్ నోట్లకు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్..?

RBI: దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ సన్నాహాలు ప్రారంభించింది. సాధారణ కాగితపు నోట్ల స్థానంలో పాలిమర్ (ప్లాస్టిక్) నోట్ల(Polymer Notes)ను ప్రవేశపెట్టే ప్రణాళికపై పని ప్రారంభించింది. తొలి...
- Advertisement -
Chat on WhatsApp