Nara Lokesh: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్‌ను కలిసిన లోకేష్, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులు సూచించిన చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అవసరమైనంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన లోకేష్, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజా జీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఇద్దరు నేతల భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Nara Lokesh | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
-








