Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTRam Gopal Varma | భారతీరాజా మృతి పట్ల రామ్ గోపాల్ వర్మ భావోద్వేగం

Ram Gopal Varma | భారతీరాజా మృతి పట్ల రామ్ గోపాల్ వర్మ భావోద్వేగం

-

Chat on WhatsApp

ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా మరణం పట్ల సినీ పరిశ్రమలో సంతాపం వెల్లువెత్తుతోంది. ఆయన మృతి సమాచారం తెలుసుకున్న అనంతరం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఎక్స్‌లో స్పందిస్తూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. భారతీరాజా కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదని, ఆయన సినిమా ప్రపంచాన్ని కొత్త దృక్పథంతో చూపించిన నిజమైన సృష్టికర్త (Auteur) అని వర్మ పేర్కొన్నారు.

భారతీయ సినీ పరిశ్రమలో ఆయనకున్న ప్రత్యేక స్థానం ఎప్పటికీ మరువలేనిదని వ్యాఖ్యానించారు. భారతీరాజా తన సినిమాల ద్వారా గ్రామీణ జీవనాన్ని, సహజత్వాన్ని, భావోద్వేగాలను ఎంతో అద్భుతంగా తెరపై చూపించారని వర్మ గుర్తుచేశారు. ఆయన కథన శైలిలో సత్యజిత్ రే స్థాయి యదార్థవాదం, హృషికేష్ ముఖర్జీ తరహా పాత్రల నిర్మాణం, బసు ఛటర్జీ శైలి సిట్యుయేషనల్ కామెడీ అంశాలు కలగలిసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

భాషా పరిమితులు లేకుండా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దర్శకుడిగా భారతీరాజా నిలిచారని వర్మ అన్నారు. ఆయన సినిమాలు భారతీయ చలనచిత్రానికి కొత్త దారులు చూపించాయని, తరతరాలకు గుర్తుండిపోయే ముద్ర వేశాయని పేర్కొన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినీ ప్రముఖులు కూడా భారతీరాజాకు నివాళులు అర్పిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp